Jobs: తాపీ మేస్త్రీకి 4.30లక్షల జీతం..పర్మినెంట్ ఉద్యోగం..అప్లయ్ చేస్తారా? తాపీ పని వస్తే ఏడాదికి నాలుగున్నర లక్షల జీతంతో శాశ్వత ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చని అమెరిక్ కాన్సులెట్ కార్యాలయం వెల్లడించింది. By Bhoomi 04 Feb 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jobs: తాపీపనిచేసేవాళ్లకు గుడ్ న్యూస్. ఏడాదికి నాలుగున్నర లక్షల జీతంలో పర్మినెంట్ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. అది కూడా హైదరాబాద్ లోనే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ కథనం చదవాల్సిందే. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. దీనికోసం యూఎస్ కాన్సులేట్ జనరల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి కోసం ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు: జాబ్ రోల్- తాపీమేస్త్రీ పోస్టుల సంఖ్య - 1 జీతం -ఏడాదికి 4 లక్షల 47వేల 348 రూపాయలు, ఇతర అలవెన్సులు కూడా ఉన్నాయి.. పని దినాలు- వారానికి 40 గంటలు జాబ్ లోకేషన్- హైదరాబాద్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 25 ఫిబ్రవరి 2024 అర్హతలు: తాపీ పనిలో రెండు సంవత్సరాల అనుభవంతోపాటు కాంక్రీటు గ్రేడ్‌లు, కాంక్రీటు వేయడం, ఇటుక పని, టెర్రాజో ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో కాంక్రీట్ బ్లాక్స్ వాల్, సహజ రాయి వేయడం, కట్టింగ్ మొదలైన పనులు ముందుగానే వచ్చి ఉండాలి. అలాగే వివిధ పనుల కోసం మెటీరియల్ పై అవగాహన కలిగి ఉండాలి. కనీసం 8వ తరగతి చదివి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో రాయడం, మాట్లాడటం, చదవాలి. వీటిపై పరీక్షలు కూడా నిర్వహిస్తారు. న్యూమాటిక్ సుత్తులు, కాంక్రీట్ స్ప్రేయర్‌లతో పనిచేసే అనుభవం తప్పనిసరి . ఎటువంటి వాతావరణంలో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పబ్లిక్ ట్రస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.అప్లయ్ చేసేటప్పుడు పైన చెప్పిన విద్యాప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హులైన వారిని ఇంటర్వ్యూకు సెలక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థుల మెయిల్ ద్వారా పంపిస్తారు.ఇంటర్య్వూ సమయంలో స్కిల్ టెస్ట్ చేసి సెలక్షన్ చేస్తారు.మరింత సమాచారం కోసం .. [email protected] మెయిల్ ఐడీకి మెయిల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గోల్డెన్ ఆఫర్…ఉచిత శిక్షణ,భోజనంతోపాటు ఉద్యోగం..పూర్తి వివరాలివే..!! #jobs-update #us-consulate-general-hiring-mason #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి