Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!

పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్‌ ఘటన గల్ఫ్‌ దేశం కువైట్‌ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది.

Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!
New Update

Viral News: పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది. ఈ షాకింగ్‌ ఘటన గల్ఫ్‌ దేశం కువైట్‌ లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యి పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి కూతురు కొంచెం స్లిప్‌ అయ్యి కింద పడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని కొంచెం విసుక్కున్నాడు.

దాంతో ఆ మాట విన్న పెళ్లి కూతురు ఆ నిమిషామే అతనికి విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నానని పెళ్లి వారితో చెప్పి అక్కడ నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టులో విచారణ ముగిసిన తరువాత కోర్టు విడాకులు మంజూరు చేసేసింది.

కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని కోర్టు పేర్కొంది. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఒక వివాహానికి వెళ్లానని, అక్కడ పెళ్లికూతురుని వరుడు ఎగతాళి చేస్తూ ఉన్నాడని, ఆమె కూడా కువైట్‌ మహిళలా విడాకులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టడంతో నాటి ఘటన మరోసారి వైరల్ గా మారింది.

తన భాగస్వామి పట్ల గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదురు వ్యక్తి ఈ పోస్టులో పేర్కొన్నాడు.పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడమే ఉత్తమమని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలాంటిదే 2004లో యూకేలో ఒక జంట పెళ్లై 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ అనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తోటి బంధువులు పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరగడంతో ఆ యువతి కూడా కేవలం గంటన్నరలోనే విడాకులు తీసుకుంది.

Also read: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు!

#social-media #dubai #marriege #divorce #kuwait
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe