Corona Update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా? దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. By V.J Reddy 21 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Corona Cases in India: దేశంలో జేఎన్.1 కరోనా వైరస్ కేసుల (JN.1 Covid variant ) పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసుల ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మొత్తం 5,33,327 మంది మరణించినట్లు తెలిపింది. కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ జేఎన్.1 కరోనా వైరస్ కేసులు (Corona Virus) ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పేర్కొంది. కేరళలో (Kerala) ఈ వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజే ముగ్గురు చనిపోయినట్లు తెలిపింది. దేశంలో నమోదు అయిన కొత్త కేసుల్లో 300 మంది కేరళకు చెందిన వారు కావడం గమనార్హం. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ పెడుతారా? అనే చర్చ భారత ప్రజల్లో మొదలైంది. ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్! తెలంగాణలో కరోనా కేసులు ఇలా.. తెలంగాణలో (Telangana) కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా బుధవారం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మొత్తం 538 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. వీరిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 కేసులు నమోదవగా.. ఇవాళ ఒకరు రికవరీ అయ్యారు. వీరిలో 14 మంది ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కాగా, మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు చూసుకుంటే.. 8,44,513 పాజిటివ్ నమోదయ్యాయి. వీరిలో 8,40,388 రికవర్ అయ్యారు. 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ రేటు 0.49 శాతం ఉంటే.. రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,91,72,240 శాంపిల్స్ పరీక్షించారు. ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే.. #covid-cases #jn-1-covid-variant #telangana-corona-updates #corona-cases #india-corona-cases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి