CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఈరోజు నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొంటుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని కేసీఆర్ విమర్శించారు. By V.J Reddy 11 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR Controversy Words: ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదిన తెలంగాణ పగ్గాలు ఎవరు చేజిక్కించుకుంటారో తెలుస్తుంది. ప్రజలు సినిమాలు చూడడం మానేసి రాజకీయ నేతల ప్రచారాలు చూస్తున్నారు. ఎందుకు అంటారా? సినిమాల్లో ఉండే ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్, డాన్సులు ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో నేతలు ప్రచారాల్లో ఆటలు, పాటలు, ప్రత్యర్థులపై డైలాగులు, విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత డైలాగులతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విషయంలో మొదటి స్థానంలో ఉంటారు సీఎం కేసీఆర్(CM KCR). ఇవాళ నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ (BRS)ను చీల్చేందుకు, ఎమ్మెల్యేలను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కుట్ర చేస్తోందని అన్నారు కేసీఆర్. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకొని అభివృద్ధి చేసుకున్న తెలంగాణను దోచుకునేటందుకు కాంగ్రెస్ నేతలు కళ్ళు ఆర్పకుండా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాలిపోయిన మోటార్లు, నీరు లేక ఎండిపోయిన పొలాలు తప్ప ఇంకా కనిపించేవి కావని అన్నారు సీఎం కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ కి ఓటు వేస్తే మళ్లీ అదే రాజ్యం వస్తుందని.. మనకు అలాంటి రోజులు మళ్లీ కావాలా? అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. గతంలోని ముఖ్యమంత్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలను దత్తత తీసుకుని చేసిందేమీ లేదని అన్నారు. ప్రజలు పార్టీల వైఖరిని గమనించాలని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు అప్పుడు ఈ జిల్లాను ఎందుకు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ALSO READ: పవన్ కళ్యాణ్ కు షాక్.. కీలక నేత రాజీనామా వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడంతో దేశంలోనే తెలంగాణ వరి ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానానికి చేరిందని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలో తాగు నీటి సమస్యను అధిగమించామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు రావడం కచ్చితమని అన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు వెళ్తుందని, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని సీఎం కేసీఆర్ అన్నారు. #brs #congress #bjp #cm-kcr #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి