Congress Special Focus On Telangana: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్‌లో తెలంగాణలోనూ అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో CWC సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. By Jyoshna Sappogula 04 Sep 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి Congress PEC Meeting at Gandhi Bhavan : తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు, పీఈసీ ఛైర్మన్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన.. గాంధీభవన్లో జరిగిన ఎలక్షన్ కమిటీ రెండో సమావేశం ముగిసింది. ఇందులో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల కమిటీ ప్రాథమిక కసరత్తు చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావాహులకు ప్రాధాన్యతా సంఖ్యలు కేటాయించింది. మరోవైపు టికెట్ల కోసం.. ఎన్నికల కమిటీలోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. తమకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యత ఓటు కోసం నేతలు మిగతా వారి మద్దతు కోరుతున్నారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్ కవర్లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పారు. పీఈసీ సభ్యులతో వేర్వేరుగా.. స్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు వివరించారు. బుధవారం డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై.. పీఈసీ ఇచ్చిన నివేదికపై పరిశీలన చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఈ కమిటీ తయారు చేసిన జాబితాను.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని చెప్పారు. Also Read: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా? మరోవైపు వీలైనంత త్వరగా మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని.. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని స్పష్టం చేశారు. అప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు కూడా సమాచారం ఉండదని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయబోతున్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలను ఆధారం చేసుకొని.. వారిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K.C. Venugopal) ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. కొత్త వర్కింగ్ కమిటీ సభ్యుల తొలి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ నెల 16న సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. 17న సీడబ్ల్యుసీ, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల భేటీ జరగనుందని వెల్లడించారు. అదే రోజున హైద్రాబాద్ లో మెగా ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదు డిక్లరేషన్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు.ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ కేంద్రంగా సీడబ్ల్యూసీ(CWC) సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనూ అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకొనేందుకు హస్తం పార్టీ అన్ని రకాల వ్యూహలతో ముందుకు వెళ్తుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ మేనిఫెస్టో విడుదలను ముందుగానే విడుదల చేయాలని భావిస్తుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే ఈ నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక తెలంగాణ(Telangana)లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీలు (BJP) కూడా ప్రజల్లోకి వెళుతూ తామ పార్టీని గెలిపించాలంటూ కోరుతున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో తామంటే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.అయితే, ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఎన్నికల తర్వాత తెలియనుంది. Also Read: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన! #revanth-reddy #brs-party #mallikarjun-kharge #tpcc #cwc #congress-pec-meeting-at-gandhi-bhavan #k-c-venugopal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి