Congress Special Focus On Telangana: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్
కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్లో తెలంగాణలోనూ అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో CWC సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.