కేంద్రమంత్రిపై నెగ్గిన శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తిరువనంతపురం నుంచి పోటీ చేసిన ఈయన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీద గెలుపొందారు.

New Update
కేంద్రమంత్రిపై నెగ్గిన శశిథరూర్

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటోంది. సీనియర్, కీలక నేతలు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురంలో విజయం సాధించారు.కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీద 15వేల ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ నియోజకవర్గం నుంచి ఈయన గెలవడం ఇది నాల్గవసారి.

మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. వయనాడ్, బరేలీల్లో విజయకేతనాన్ని ఎగురవేశారు. ఇక అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్ధి కే ఎల్ శర్మ బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీపై గెలుపొందారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు