Bandi Sanjay : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మరోసారి సీఎం అయ్యేందుకు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలన్నారు.

New Update
Bandi Sanjay : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

MP Bandi Sanjay : బీజేపీ(BJP) నేత, కరీంనగర్(Karimnagar) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. ఇందుకోసం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని అన్నారు బండి సంజయ్. మరి కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అని కొత్త చాప్టర్ కు తెర లేపారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ నేతలు ఓ కన్నేసి ఉంచాలని అన్నారు. దేశంలో అభివృద్ది జరగాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్న బీజేపీ గెలవాలి అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దూరం లేపాయి.

కేసీఆర్ రీఎంట్రీ.. గజ్వేల్..

కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో గజ్వేల్(Gajwel) లో పర్యటిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కనుబాటలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రతిపక్ష హోదాలో అటు ఇటీవల జరిగిన అసెంబ్లీ లోనూ అలాగే బయట కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం.

Also Read : Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు