Medigadda: నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు

ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు కాంగ్రెస్ మంత్రులు వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టనున్నారు.

New Update
Medigadda: నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు

Kaleshwaram Project : తెలంగాణ(Telangana) లో అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) లో జరిగిన అవినీతిని బయటపెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేపడుతామని తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం, అన్నారం బ్యారేజి లీకేజి కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.లక్ష కోట్ల అవితిని జరిగిందని ప్రచారం చేశారు. అదే సమయంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజి లీక్ అవ్వడంతో బీఆర్ఎస్ కు ఎన్నికల సమయంలో ఓటమి పాలవ్వడానికి గట్టి ప్రభావం చూపించింది.

అన్నారం, మేడిగడ్డకు కాంగ్రెస్ మంత్రులు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మంత్రులు ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నలుగురు మంత్రులు అక్కడ పర్యటించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజ్ వంగడం, పిల్లర్లు పగలడం, అన్నారం బ్యారేజీలో సిపేజ్లు ఏర్పడడం, ప్రాజెక్టు డిజైన్ లోపాలు వంటి పలు అంశాలు రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు.

మంత్రుల పర్యటన వివరాలు..

ఈ రోజు 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30కి మేడిగడ్డకు చేరుకుంటారు. 11:30 నుండి ఒంటి గంట వరకు ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరిగవెళ్తారు. 2 నుంచి 3 గంటల వరకు మీడియా ప్రతినిధు లతో కలిసి భోజనం చేస్తారు. 3 నుంచి 3.20 వరకు మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ పరిశీలిస్తారు. 5.30కి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.


ALSO READ:

  1. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!
  2. గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ

Advertisment
తాజా కథనాలు