Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు

తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది? అంటూ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అన్నింటికంటే ఢిపరెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అంటూ లోక్ పోల్ సర్వే చెబుతోంది. అందరికన్నా భిన్నంగా ఉండడంతో దీని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

New Update
Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు

Lok Poll Survey - Telangana Elections: దేశం మొత్తం ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో కూడా హడావుడి మొదలైంది. రేపో మాపో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తుల ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ను కూడా విడుదల చేసింది. మిగతా పార్టీలు తొందరలోనే చేస్తారు. ప్రచారాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. తెలంగాణలో ఈసారి కూడా తమదే అధికారం అని బీఆర్ఎస్ అంటోంది. హ్యాట్రిక్ కచ్చితంగా కొడతామని చెబుతోంది. కానీ కాంగ్రెస్ (Congress) , బీజెపీ (BJP) నేతలు ఎలా అయినా బీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు కూడా తమ పలితాలను వెల్లడిస్తున్నాయి. అందరూ మళ్ళీ తెలంగాణకే పట్టం కడుతుంటే లోక్ పోల్ సర్వే మాత్రం (Lok Poll Survey) కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. దీంతో ఈ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

లోక్ పోల్ సర్వేలో మాత్రం హస్తానిదే హవా నడుస్తుందని తేలింది. లోక్ పోల్ ప్రీపోల్ సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం 61 నుంచి 67 సీట్లు రానున్నట్టు చెబుతోంది. ఇక ఈసారి తెలంగాణలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లకే పరిమితం కానుందని లోక్ పోల్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇక ఏఐఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని.. ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలున్నట్టు పలితాల్లో తేలింది.

ఈ సర్వేలో సీట్ల విషయంలో బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ కు 15 సీట్లకు పైగానే వ్యత్యాసం కనిపిస్తోన్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు కూడా 41 నుంచి 44 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇక 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే బీజేపీ మాత్రం 10 నుంచి 12 శాతం ఓటింగ్ సంపాధించుకునే అవకాశం ఉంది. కాగా.. ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం పార్టీకి మాత్రం మూడు నుంచి 4 శాతం ఓటింగే వచ్చే అవకాశం ఉందని లోక్ పోల్ సర్వేలో తేలింది.

సీటుకు నోటు దొంగ...

లోక్ సోల్ సర్వే మీద బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇదంతా రేవంత్ (Revanth Reddy) సృష్టి అని విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ కాతాలో పోస్ట్ చేశారు. ఓటుకు నోటు దొంగ ఇప్పుడు సీటుకు నోటు దొంగగా మారాడని...జాగ్రత్తగా ఉండాలని శ్రవణ్ తన పోస్ట్ లో రాశారు. సమర్ధులైన అభ్యర్ధులే లేరు కానీ మెజారిటీ సీట్లు గెలుస్తారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు రేంటెంత రెడ్డి, కొనుగోలు సునీల్ అంటూ వెటకారం చేశారు.

Also Read: జ్యూస్ షాప్, టైర్ షాప్…మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు