లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ఏ పార్టీకీ కూడా ప్రజలు మ్యాజిక్ ఫిగర్ రాలేదని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని అన్నారు. రాహుల్‌చేపట్టిన యాత్రలు కాంగ్రెస్‌కు సీట్లు పెరిగేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామని పేర్కొన్నారు.
Also Read: మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు