Sharmila: చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే? తన కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును కలిసి ఆహ్వానించినట్లు షర్మిల తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అన్నారు. తనకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని తెలిపారు. By V.J Reddy 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Sharmila Meets Chandrababu: కాంగ్రెస్ నేత షర్మిల ఈరోజు చంద్రబాబుతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. షర్మిల మాట్లాడుతూ.. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వచ్చినట్లు షర్మిల పేర్కొన్నారు. ఈ భేటీలో రాజకీయాల గురించి ఏమి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమ కుమారుడి పెళ్ళికి చంద్రబాబు తప్పకుండ వస్తాను అని మాట ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ALSO READ: ప్రాణం తీసిన పతంగి సరదా ఆయనకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మధ్య ఉన్న సంభందం గురించి గుర్తు చేసుకున్నారని అన్నారు. రాజకీయాలు జీవితం కాదని కేవలం ఒక ప్రొఫెషన్ అని అన్నారు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ అని అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారని తెలిపారు. తన పెళ్ళికి చంద్రబాబు వచ్చారని అన్నారు. ఇక్కడ కేటీఆర్, హరీష్, కవితకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏది ఇస్తే అది.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ ని విలీనం చేసిన షర్మిల చంద్రబాబుతో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవి ఇచ్చిన తతాను తప్పకుండ స్వీకరిస్తానని అన్నారు. తనకు అదే పదవి కావాలనే ఆశ లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే.. షర్మిలకు ఏ పదవి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కడపలో షర్మిలను నిలబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు కొన్ని రోజులగా వార్తలు జోరందుకున్నాయి. దీనిపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. రాహుల్ ప్రధాని.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని అన్నారు వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తాను పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన షర్మిల చంద్రబాబు నాయుడు గారిని నా కొడుకు పెళ్లికి మర్యాదపూర్వకంగా పిలవడానికి వచ్చాను రాష్ట్రంలో ఫ్రెండ్లీ రాజకీయాలు ఉండాలి. pic.twitter.com/ULQ5XUTXJ9 — Telugu Scribe (@TeluguScribe) January 13, 2024 ALSO READ: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ #chandrababu #cm-jagan #sharmila #sharmila-son-marriage #sharmila-meets-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి