Priyanka Gandhi Over Inter Paper Leak: ఈ మధ్య పరీక్ష పేపర్ లీకేజి ఘటనలు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పేపర్ కూడా లీకయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా అక్కడ మరోసారి పరీక్ష పేపర్ లీకైంది. ఈసారి 12వ తరగతి బోర్టుకు చెందిన మ్యాథ్స్, బయాలజీ పేపర్‌లు పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చిన వీటిని షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు.
Also Read: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు!
అవినీతిపరుల్ని బీజేపీ రక్షిస్తోంది
మరోసారి పేపర్‌ను ఎందుకు లీక్ చేశారని.. బీజేపీ పాలనలో ఉద్యోగ పరీక్షల నుంచి చివరికి బోర్డు పరీక్షల వరకు ప్రతీ పేపర్ లీక్ అవతోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఎదుర్కొనే మొదటి సవాలు ఈ బోర్డు పరీక్షేనని అన్నారు. ఇక్కడే వాళ్లకి ద్రోహం చేస్తే ఎలా అంటూ నిలదీశారు. పిల్లల భవిష్యత్తును దెబ్బతీసేలా.. ప్రభుత్వంలో కొందరు అవినీతిపరుల్ని బీజేపీ రక్షిస్తోందని మండిపడ్డారు. పిల్లలు మంచి చదువులు చదివితే.. బీజేపీకి ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు.
కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు పనే
ఇదిలాఉండగా.. ఇంటర్ బోర్డుు పేపర్ లీకేజీపై ఫతేపూర్ సిక్రీలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఓ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్.. అలాగే కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన కొడుకుతో పాటు మరికొందరి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. అయితే 'ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా' అనే వాట్సాప్ గ్రూప్‌లో ఈ ప్రశ్నపత్రాలను ప్రిన్సిపల్ కొడుకే పోస్టు చేశాడని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.