కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబంర మోదీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ' 2023-24లో ఇండియన్ ఎకానామీ పటిష్ఠంగా ఉందని బీజేపీ చెప్పింది. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయి అనే దానిపై వివరణ ఇవ్వడం లేదు. FDI అనేది ఒక దేశంలో ఉన్న ప్రభుత్వ, దాని విధానాలపై విదేశీ పెట్టుదారులకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది.
Also Read: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు
పెట్టుబడిదారులకు బీజేపీపై విశ్వాసం లేదు
విదేశీ పెట్టుబడిదారులకు అలాంటి నమ్మకం 2023-24లో తగ్గిపోయింది. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇస్తోంది. విదేశీ, భారతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి సర్టిఫికేట్ రావాలి. గత మూడేళ్లుగా బీజేపీ ప్రభుత్వంపై పెట్టుబడిదారులు విశ్వాసాన్ని చూపించలేదు. వడ్డి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. నిజమన వేతనాలు ఆగిపోయాయి. నిద్యోగం పెరుగుతోంది. గృహ వినియోగం తగ్గిపోతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇవి కచ్చితమైన సంకేతాలు. ఇవి బీజేపీకి అర్థం కావడం లేదు. దీన్ని వాళ్లు పట్టించుకోవడం లేదని' చిదంబరం అన్నారు.
ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మోదీ సర్కార్‌ను గద్దె దింపాలని ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 కౌంటింగ్ జరగనుంది.