Congress : కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు

ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు.

New Update
Congress : కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు

Tax Notice : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌(Congress) వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చారని.. కాంగ్రెస్ నేత వివేక్ తంఖా తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు, డ్యాకుమెంట్లు లేకుండానే తమకు గురువారం నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ

కావాలనే చేస్తున్నారు

పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) వస్తున్న నేపథ్యంలోనే తమ పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని మండిప్డడారు. చట్టపరంగా ఈ వ్యవహారంపై సవాల్ చేస్తామని అన్నారు. ఇదిలాఉండగా.. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారించిన న్యాయస్థానం పిటిషన్లు కొట్టివేసింది.

ఇప్పటికే రూ.1.35 కోట్లు

కాంగ్రెస్‌పై చర్యలు చేపట్టేందుకు ఐటీ అధికారుల దగ్గర ఆధారాలున్నాయని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు(High Court) తెలిపింది. అలాగే అంతకుముందు 2014-15 నుంచి 2016-17కు సంబంధించి ఐటీ శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కూడా ఈ కారణాలతోనే న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పునఃపరిశీలనకు సంబంధించి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే రూ.1.35 కోట్లు రికవరీ చేసింది ఆదాయపు పన్ను శాఖ.

Also Read : అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు