Telangana : అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించగలరా : ఖర్గే

ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.

Mallikarjun Kharge: మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి.. మల్లికార్జున ఖర్గే డిమాండ్
New Update

Adani - Ambani : బీజేపీ(BJP) కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని.. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. అలాగే రిజర్వేషన్లు పోతాయని, ప్రజల ప్రాథమిక హక్కులు తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రావద్దని.. వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లేనని అన్నారు.

Also Read: తల్లి కాళ్లకు నమస్కరించిన కేజ్రీవాల్

శుక్రవారం నల్గొండ(Nalgonda) జిల్లా నకిరేకల్‌లో.. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మద్దతుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు కుట్ర పన్నుతాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు ట్రక్కలు, టెంపోలలో డబ్బులు పంపుతున్నారని అమిత్ షా, మోదీ అంటున్నారని.. వాళ్లు డబ్బులు పంపిస్తుంటే మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.

Also Read: తెలంగాణలో RR ట్యాక్స్ కాదు RRR ట్యాక్స్ నడుస్తోంది.. మోదీ కీలక వ్యాఖ్యలు

#telugu-news #congress #bjp #2024-lok-sabha-elections #mallikharjuna-kharge
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe