Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థులు తుది జాబితా విడుదల ! తెలంగాణలో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ (CEC) మరోసారి సమావేశం కానుంది. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress Final List Released : తెలంగాణ(Telangana) లో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్(Congress) హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ(CEC) మరోసారి సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీకి పార్టీ అగ్రనేతలు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా.. కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు? అయితే తెలంగాణలో 8 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి.. ఏఐసీసీ(AICC) రాష్ట్రానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది. వారు ప్రతిపాదించిన సూచనల మేరకు అభ్యర్థులను పరిశీలించి ఫైనల్ లిస్టును సీఈసీకి పంపించింది. ప్రజల్లో ఆదరణ, కుల సమీకరణ, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫార్సు చేశారు. అలాగే సీఈసీ కూడా పలు సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా ఎంపీ అభ్యర్థులపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి దిల్‌రాజు, సునీల్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశిలించినప్పటికీ.. టి. జీవన్‌రెడ్డి వైపై పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ వర్గం కూడా ఈయనకు మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భువనగిరి ఎంపీ స్థానానికి మాత్రం కాస్త సందిగ్ధత కనిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమట్రెడ్డి వెంకట్‌రెడ్డిలు కొన్ని పేర్లు ప్రతిపాదిస్తుంటే.. సీఎం రేవంత్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. Also Read : సెలవులకు ఊరెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే.. రైలు సర్వీసులు పొడిగింపు! ఇక వరంగల్, ఖమ్మం, హైదరాబాద్(Hyderabad) స్థానాల్లో ఒకరిద్దరి పేర్లను పరిశీలించి.. విజయావకాశాలు ఉన్నవారికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే అభ్యర్థుల జాబితాను ఈరోజు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు రానున్నారు. ఈ సభలో జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో TPCC ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. #cm-revanth #telangana-politics #telangana #congress #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి