TS MLCs: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవులపై కసరత్తు చేస్తోంది. గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులని ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచలనలో ఉంది. 2 పదవుల కోసం 8 మంది పోటీలో ఉన్నారట.

New Update
TS MLCs: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా?

Attention On MLC Seats: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్సీ టికెట్స్ ఎవరికి ఇవ్వబోతున్నదనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెస్ట్ ఆశించి భంగపడ్డ వారు, ఎన్నికల్లో ఓడిపోయిన వారు, సీనియర్ నాయకులు ఇలా అందరి చూపు ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలపైనే ఉంది. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండిKishan Reddy: ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. మా యాక్షన్ ప్లాన్ ఇదే: కిషన్ రెడ్డి 

గత బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి కేబినెట్ గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ పదవులకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది. అయితే గవర్నర్ తమిళిసై వారి పేర్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Lokesh: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! 

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఆ రెండు పదవులను ఎవరికి కేటాయించాలనే దానిపై ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చలు జరుగుతున్నాయట. 2 సీట్ల కోసం 8 మంది పోటీ పడుతున్నారటని టాక్ వినిపిస్తోంది. ఈ రేసులో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, కవి అందెశ్రీ, చాడ వెంకట్‌రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో సీపీఐకి 2 ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే, ఎవరి పేర్లు పంపాలన్నదానిపై కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు