Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. మా యాక్షన్ ప్లాన్ ఇదే: కిషన్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో మండలాధ్యక్షులు, ఆపై నేతలతో నిర్వహించే సమావేశానికి అమిత్ షా, తరుణ్ చుగ్ తో పాటు అగ్రనేతలు హాజరవుతారన్నారు. By Nikhil 26 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి దేశానికి మళ్లీ మోదీ (PM Modi) ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే తెలంగాణలో ఎంపీ రిజల్ట్స్ అనూహ్యంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనవరి నెల అంత పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలు ఉంటాయన్నారు. యువత బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. వారందరినీ బీజేపీలో చేర్చుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని స్టేట్ లెవెల్ మీటింగ్ ను ఈ నెల 28న ఉంటుందని తెలిపారు. ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఈ సమావేశాలకు మండల ప్రెసిడెంట్ ఆ పై స్థాయి నాయకులు హాజరు అవుతారన్నారు. ఈ మీటింగ్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, లక్ష్మణ్ తదితర ముఖ్యనేతలంతా హాజరవుతారన్నారు. కొంగరకలాన్ లోని శ్లోక ఫంక్షన్ హాల్ లో ఈ మీటింగ్ ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పారు. తద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతామన్నారు కిషన్ రెడ్డి. శాసనసభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదని.. కానీ ఓటింగ్ శాతం సీట్ల సంఖ్య పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చితే 100 శాతం ఓటింగ్ పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయని వర్గాలు సైతం .. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఓటేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. #amit-shah #g-kishan-reddy #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి