Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

New Update
Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల

Telangana : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా(Rythu Bharosa) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 5 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar) నిధులు విడుదల చేసింది. తాజాగా ఐదు ఎకరాలు పైబడినవారికి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించారు.

Also Read: గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!

ఇదిలాఉండగా.. తెలంగాణలో గత కొన్నిరోజులుగా రైతు భరోసా నిధుల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిధులు ఇంకా విడుదల చేయడం లేదని రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్(BRS) నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కాంగ్రెస్ సర్కార్‌ చివరికి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు విడుదల చేసింది. మరోవైపు ఇటీవల రుణమాఫీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి..

Advertisment
తాజా కథనాలు