Congress: గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!

హైదరాబాద్ గాంధీభవన్ లో కార్వాన్ కు చెందిన కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
Congress: గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!

Congress: హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సమీరుల్లాఖాన్‌ ముందే కార్వాన్‌కు చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్‌ కో ఆర్డినేషన్‌ సమావేశంలో ఈ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా వీడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంత నచ్చజెప్పినా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇక చేసేదేమి లేక గాంధీభవన్‌ నుంచి అసహనంతో వెళ్లిపోయారు ఎంపీ సమీరుల్లాఖాన్‌.

Advertisment
తాజా కథనాలు