Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

TG: రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన రేవంత్ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోన్ రెన్యూవల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు.

Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
New Update

Runa Mafi: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటికే లోన్ రెన్యూవల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు. అందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)కు సంబంధించి డీసీసీబీలకు విడుదల చేసే మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో ఆయా రైతుల ఖాతాల్లో వెయ్యాలని ఆదేశించారు.

రూ. లక్షలోపు రుణాలు మాఫీ..

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను నిన్న ప్రారంభించింది. రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసింది. లక్ష లోపు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలున్నాయి. దీంతో వీరందరి రుణాలు ఇప్పుడు మాఫీ కానున్నాయి. ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌ చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు.

Also Read: సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న నిజామాబాద్ కుర్రాడు.. టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

#runa-mafi #congress #bhatti-vikramarka #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe