/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/accounts-jpg.webp)
దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ నిలిపివేసినట్లు.. ఆ పార్టీ నేతలు తెలిపారు. అంతేకాదు ఐటీ శాఖ వాళ్లు ఫ్రీజ్ చేసిన వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. పన్ను కట్టలేదనే కారణంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిన గంట తర్వాత.. అధికారులు మళ్లీ ఖాతాలను పునురద్ధరించారు. ఈ అంశంపై ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేయడం వల్ల ఉపశమనం లభించింది.
हिंदुस्तान में लोकतंत्र पूरी तरह से खत्म हो चुका है।
देश की मुख्य विपक्षी पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। भारतीय राष्ट्रीय कांग्रेस के अकाउंट पर तालाबंदी कर दी गई है।
ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए, हमारे देश का लोकतंत्र फ्रीज हो गया है।
: कांग्रेस… pic.twitter.com/ndoT5IHKtg
— Congress (@INCIndia) February 16, 2024
Also Read: త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
పన్ను చెల్లించనందుకేనా..!
కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో.. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మండిపడ్డారు. కనీసం విద్యుత్ బిల్లులు, సిబ్బందికి కూడా జీతం ఇవ్వడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదంటూ వాపోయారు. రూ.210 కోట్లు పన్ను చెల్లించలేదనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆరోపించారు. 2018 -19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ అకౌంట్లను సమర్పించిందని.. కేవలం దీనికే అకౌంట్లు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండానే చేస్తున్నారని.. అధికార పార్టీ.. విపక్ష పార్టీని లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యపై తాము న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను (ITAT)ని ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు.
నియంతృత్వ తీరును ఎండగడతాం
మరోవైపు దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వాడుతారు.. కానీ మేం క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధుల్ని మాత్రం అడ్డుకుంటారని మండిపడ్డారు. అందుకే నేను భవిష్యత్తులో ఎన్నికలు జరగవని గతంలోనే చెప్పానని అన్నారు. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను అలాగే దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగతామని పేర్కొన్నారు.
Power drunk Modi Govt has frozen the accounts of the country’s largest Opposition party - the Indian National Congress - just before the Lok Sabha elections.
This is a deep assault on India's Democracy !
The UNCONSTITUTIONAL money collected by the BJP would be utilised by them…
— Mallikarjun Kharge (@kharge) February 16, 2024
మాకు డబ్బు బలం కాదు ప్రజాబలం ఉంది
అలాగే ఈ చర్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఆదాయ పన్ను శాఖ వెనుక మోదీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మోదీకి తాము భయపడమని.. కాంగ్రెస్‌కు డబ్బు బలం లేదని.. ప్రజా బలం మాత్రమే ఉందని అన్నారు. నియంతృత్వ పాలను ముందు తాము ఎన్నడు తలవంచలేదని.. ఎప్పటికీ తలవంచమన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడుతారని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందనట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
डरो मत मोदी जी, कांग्रेस धन की ताकत का नहीं, जन की ताकत का नाम है।
हम तानाशाही के सामने न कभी झुके हैं, न झुकेंगे।
भारत के लोकतंत्र की रक्षा के लिए हर कांग्रेस कार्यकर्ता जी जान से लड़ेगा।#DemocracyUnderAttack
— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2024
Also Read: వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన