NOTA : మధ్య ప్రదేశ్(Madya Pradesh) లోని ఇండోర్ లోక్ సభ(Lok Sabha) స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 40 ఏళ్లుగా బీజేపీయే గెలుస్తుంది. ఈసారి బీజేపీ నుంచి శంకర్ లల్వానీ, కాంగ్రెస్ నుంచి అక్షయ్ బామ్ అనే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
అంతేకాదు, కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ(BJP)లో చేరారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నోటాకు ఓటు వేయాలని జోరుగా ప్రచారం నిర్వహించింది.
ఇక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ అంశంపై కోర్టుకు వెళ్లింది. మరొకరి పోటీకి హైకోర్టు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ అనివార్యంగా పోటీలో లేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెట్ లుగా ఉన్నారు. . దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నోటాకు ఓటు వేయాలని జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే నోటాకు ఓటు వేయండని గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించింది. తమ పార్టీ అభ్యర్థిని దొంగిలించిన బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ జీతూ పట్వారి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇక్కడ సేవ్ డెమోక్రసీ పేరుతో ప్రతిచోట పోస్టర్లు అంటిస్తోంది.
Also read: భారీ లాభాలతో టాటామోటార్స్ సంచలనం.. ఒక్క ఏడాది లాభాలు వింటే మతిపోతుంది