Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో సమావేశాల్లో (Telangana Assembly) బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆనాడు కాంగ్రెస్ పార్టే మంత్రిని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని.. వాటిని ఖండించారు. నాడు కాంగ్రెస్ పార్టీకి (Congress Party) జీవం పోసిందే కేసీఆర్ (KCR) అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ అధికార బిక్ష పెట్టారని పేర్కొన్నారు. మేం పొత్తు పెట్టుకోవడం వల్లే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
ALSO READ: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ
14 నెలలకే ఆనాటి వైఎస్సార్ (YS Rajashekar Reddy) సర్కార్ నుంచి వైదొలిగామని తెలిపారు. వైఎస్ హయాంలో మాతో ఉన్నది పీజేఆర్ (PJR) మాత్రమే అని స్పష్టం చేశారు. 610 జీవో అమలు చేయనందుకే వైఎస్ సర్కార్ నుంచి వైదొలినట్లు పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుపై ఆనాటి టీఅర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకులే కొట్లాడారని సభలో గుర్తు చేశారు. పదవుల కోసం పాకులాడే తత్వం తమకు లేదని అన్నారు. పార్టీ మారే చరిత్ర తమకు లేదని అన్నారు.
ALSO READ: హైదరాబాద్‌కి సింహం లాంటి కుక్క.. ధర రూ.20 కోట్లు..!
ఆనాడు తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వను అన్నది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) కాదా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటగా ఏబీవీపీలో (ABVP) ఉండి తరువాత ఆనాటి టీఅర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. తెలంగాణలో టీడీపీ (TDP) మనుగడలో లేదని కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు సీఎం అయ్యాడని అన్నారు. రేవంత్ రెడ్డిల పార్టీలు మారే తత్వం తమకు లేదని.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నామని తేల్చి చెప్పారు.