Cong- AAP Seats : అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. ఇంకో కొద్ది రోజుల్లో దాపి గడువు కూడా ముగిసి పోనుంది. అయితే ఇప్పటివరకు అక్కడ కాంగ్రెస్, ఆ మధ్య సీట్ల పంపకం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఆశిస్తుంటే...కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ఇస్తామని చెబుతోంది. డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీట్ల పంపకం మీద చర్చలు ఎంతకీ తెగడం లేదు. రెండు పార్టీలు రాజీకు రావం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా పరిష్కారం కాలేదు. ఆప్‌కి 5-6 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీకి ఒకటి, లెఫ్ట్ పార్టీలకు ఒకటి ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆప్ నేతలు మాత్రం 10 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.
అయితే ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌ఓనే కలిసి వెళుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హర్యానా కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపక్ బబారియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. త్వరలోనే సీట్ల సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళతామని తెలిపారు. ఇక రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పునియాల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు దీపక్. ఈరోజు వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసిన నేపథ్యంలో రెజ్లర్లకు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది.
Also Read: Mobile Phones: మన ఫోన్ మనల్ని స్పై చేస్తోంది..షాకింగ్ నిజాలు