Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. వరంగల్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. By B Aravind 01 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kadiyam Kavya As Warangal MP Candidate : వరంగల్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ (Congress) హైకమాండ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జాబితాను విడుద చేసింది. అయితే కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. Also Read: నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయకండి: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కడియం శ్రీహరి రాజీనామా సంగతి ? ఇందుకు కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ కడియం శ్రీహరి తన రాజీనామాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయన కూతురు కడియం కావ్యకే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరికి రావడంతో.. బీఆర్‌ఎస్ పార్టీ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని ఆమె దీన్ని నిరాకరించింది. ఆ తర్వాత కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన కడియం.. మిగతా నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు.. తాను వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం ఓ కీలక నేత. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కావ్యకి లోక్‌సభ టికెట్ ఇచ్చినా కడియం శ్రీహరి.. తన కూతురుతో కలిసి పార్టీని వీడటంపై చర్చనీయాంశమవుతోంది. Also Read: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు #brs #telugu-news #congress #lok-sabha-elections-2024 #kadiyam-srihari #kadiyam-kavya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి