![TGPSC Group-1: గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయండి: ఆర్ఎస్పీ డిమాండ్!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rs-praveen-jpg.webp)
RS Praveen Kumar: ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్‌పీ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ఆయనకు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా ప్రవీణ్ కుమార్.. ఎక్స (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సర్కార్‌కు కీలక సూచనలు చేశారు. మిగతా గ్యారెంటీల తరహాలో నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని.. కోరారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. రాష్ట్రంలో నేడు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రేసు గ్యారంటీలలో భాగంగా తెలంగాణలో ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నరు. మిగతా గ్యారంటీల లాగానే అందరినీ ఏప్రిల్ ఫూల్స్ ని చేయరనే ఆశిస్తున్నా @revanth_anumula @TelanganaCMO గారు! pic.twitter.com/wQDHW66RHh
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 1, 2024
Also Read: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేయకుండా.. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ తమ జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది.
Also Read: ఆ రహస్య మార్గాలపై నిఘా పెంచండి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు