Watch Video : పులి, ఎలుగుబంటి మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. పొదల్లోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి పులిపై మీదకు దాడికి వెళ్లింది. కానీ పులి బెదరకుండా అక్కడే నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
Watch Video : పులి, ఎలుగుబంటి మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

Tiger - Bear : జంతువులు(Animals) ఒకదానికొకటి ఎదురుపడి పోట్లాడుకున్నప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఓ వీడియో వైరలవుతోంది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని పిలిభిత్‌ టైగర్ రిజర్వ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ వీడియోను చూస్తే.. అటవీ ప్రాంతంలోని దారి మార్గంలో ఒక పులి తిరుగుతూ ఉంది. ఆ రోడ్డుపై సఫారీ వాహనంలో వెళ్తున్న పర్యాటకులు దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం

అయితే ఒక్కసారిగా ఓ ఎలుగుబంటి పొదల్లోంచి బయటకు వచ్చింది. దీంతో ఎలుగుబంటి వెళ్లిన పొదలవైపు పులి తొంగి చూసి ఆ తర్వాత పక్కకు వెళ్లింది. మళ్లీ ఎలుగుబంటి(Bear) తిరిగి వచ్చి దాడి కోసం పులి మీదకు వెళ్లింది. దీంతో ఈ రెండు జంతువులు కాసేపు గొడవ పడ్డాయి. పులి ఏమాత్రం బెదరకుండా అక్కడే నిల్చోని ఉంది. ఆ తర్వాత ఎలుగుబంటి తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా.రవి గుప్తా ఎక్స్‌(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఎలుగుబంటి దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పులి భయపడలేదని, ప్రశాంతత కోల్పోలేదని అన్నారు. మానవులకు ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పుతుందంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Also Read: రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పక్కా? ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్!

Advertisment
తాజా కథనాలు