/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T123757.453-jpg.webp)
Please Give Birth To Children : చైనా(China), దక్షిణ కొరియా(South Korea) ల్లాంటి దేశాల్లో యువత పెళ్ళిళ్ళు(Youth Marriages) చేసుకుంటున్నారు కానీ పిల్లలను కనడం లేదు. దక్షిణ కొరియాల్లాంటి దేశాల్లో ఆర్ధిక భారం చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్(Covid) తర్వాత అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాస్య జనం బతకడమే కష్టంగా ఉంది. దీంతో కొరియన్లు పిల్లలను కనడానికి భయపడుతున్నారు. ఇది ఆ దేశాల్లో ముసలాళ్ళ జనాభా పెరిగడానికి కారణం అవుతోంది. పిల్లలు, యువత జనాభా చాలా తగ్గిపోతోంది. దీంతో అక్కడ ప్రొడక్టివిటీ కూడా గణనీయంగా పడిపోతోంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు, సంస్థలు అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఆమధ్య దక్షిణ కొరియా అధినేత కిమ్ జోంగ్(Kim Jong Un) కూడా ఇదే విషయంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ప్లీజ్ అమ్మా పిల్లలను కనండి అంటూ బతిమాలుకున్నాడు కూడా. కిమ్ కన్నీళ్ళ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పడు అలాంటిదే మరొక న్యూస్ చాలా వైరల్ అవుతోంది.
Also Read : Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు
పిల్లలను కనండి డబ్బులు పట్టుకుపోండి..
దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ బూయోంగ్ గ్రూప్ సంచలనాత్మక ప్రకటన చేసింది. పిల్లలను కంటే ఊహించలేనంత డబ్బులు ఇస్తామని చెబుతోంది. వాళ్ళ ప్రకటన ప్రకారం కంపెనీలో ఉన్న ఉద్యోగులు ఎవరైనా పిల్లలను కన్నట్టు చూపిస్తే 100 మిలియన్ కొరియన్ వోన్ ఇస్తామని చెప్పింది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 63 లక్షలతో సమానం. ఈ ప్రకటనను కేవలం వాళ్ళ ఆఫీసులో మాత్రమే ప్రకటించి ఊరుకోలేదు. మొత్తం దేశమంతా తెలిసేలా ఏకంగా వార్తా పత్రికలోనే ప్రకటన వేయించింది బూయోంగ్ కంపెనీ.
2021 నుంచీ ఇస్తాము...
తమ మాటలను నిజమని నిరూపించుకోవడానికి బూయోంగ్ కంపెనీ చాలా పెద్ద స్టెప్పే వేసింది. ఇక మీదట పిల్లలను కన్నవాళ్ళకే కాదు 2021 నుంచి ఎంత మంది ఉద్యోగులు పిల్లలను కన్నారో మొత్తం వాళ్ళందరికీ 63 లక్షలు ఇస్తామని తెలిపింది. దీని కోసం మొత్తం ఏడు బిలియన్ వోన్లను పంపిణీ చేస్తామని తెలిసింది. ఆడ, మగ అందరు ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సంతాన లేమిలో దక్షిణ కొరియా..
పాపం సౌత్ కొరియా చాలా రోజుల నుంచి సంతాన లేమి(Childlessness) తో బాధపడుతోంది. సంతాన లేమి అంటే పిల్లలు కలగకపోవడం కాదు ఇక్కడ పిల్లలను కనాలనుకోకపోవడం. దీంతో ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు భయంకరంగా పడిపోతోంది. గణాంకాల ప్రకారం 2022 నుండి దక్షిణ కొరియా ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటు 0.78ని నమోదు చేసుకుంటోంది. ఈ సంఖ్య 2025 నాటికి 0.65కి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. సంతానోత్సత్తి కోసం అక్కడ కిమ్ గవర్నమెంటు కూడా చాలానే స్కీమ్‌లు పెడుతోంది. ప్రజలను ప్రోత్సహిస్తోంది.
ఇప్పడు బూయోంగ్ కంపెనీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఆర్ధిక భారంతోనే దక్సిణ కొరియా ప్రజలు పిల్లలను కనడం లేదని... ఇలా డబ్బులు ఇస్తా అది తగ్గి పిల్లలను కనడానికి ఉత్సాహం చూపిస్తారని అంటున్నారు బూయోంగ్ కంపెనీ అధికారి జూంగ్ క్యూన్. కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు ఎవరికైనా ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు 300 మిలియన్ల కొరియన్ వోన్స్(Korean Vons) తో పాటూ స్థలం కూడా ఇస్తామని చెబుతున్నారు.
Also Read : Kasuri Methi : స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు