Telangana: అందుకే విద్యుత్‌శాఖ సమీక్షకు నేను వెళ్లలేదు.. సీఎండీ ప్రభాకర్‌ రావు సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌ రెడ్డి విద్యుత్‌శాఖ సమీక్ష నిర్వహించగా దీనికి రాకపోవడంపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు స్పందించారు. ఈ సమీక్షపై విద్యుత్ శాఖ నుంచి గాని సీఎంవో కార్యాలయం నుంచి గాని తనకు ఎలాంటి అందలేదని తెలిపారు. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లనని వ్యాఖ్యానించారు.

Telangana: అందుకే విద్యుత్‌శాఖ సమీక్షకు నేను వెళ్లలేదు..  సీఎండీ ప్రభాకర్‌ రావు సంచలన వ్యాఖ్యలు
New Update

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మరుసటిరోజే (శుక్రవారం) విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సమావేశానికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న డి.ప్రభాకరరావు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై ప్రభాకర్‌రావు స్పందించారు. విద్యుత్‌శాఖ సమీక్షపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లకుండా ఉంటానంటూ వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖ నుంచి గాని సీఎంవో కార్యాలయం నుంచి గాని తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. సీఎం పిలిస్తే కచ్చితంగా హాజరవుతానంటూ స్పష్టం చేశారు.

Also Read: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం!

ఇదిలాఉండగా.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న డి.ప్రభాకరరావు రాజీనామాను ఆమోదించరాదని.. డిసెంబర్ 8న జరిగే సమావేశానికి ఆయన తప్పకుండా హాజరుకావాలని.. ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజీనామాలు సమర్పించినా, చేయకపోయినా ఇతర విద్యుత్తు శాఖల హెడ్‌లతో పాటు ప్రభాకర్‌రావు తప్పనిసరిగా హాజరుకావాలని, విద్యుత్‌శాఖ మొత్తం 80,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాల్లో ఎందుకు కూరుకుపోయిందో, ఈ పరిస్థితి ఎలా వచ్చిందో వివరించేందుకు సిద్ధంగా రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే మీటింగ్‌కు ప్రభాకర్‌రావు రాలేదు.

Also Read: కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..మరి కాసేపట్లో ఢిల్లీకి ప్రయాణం

ప్రభాకర్ రావు సోమవారం తన రాజీనామాను సమర్పించగా, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ ఎ. గోపాల్ రావు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అటు విద్యుత్‌శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వకపోవడంపై ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మపై రేవంత్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తిగా ఉండగా.. తాజాగా ప్రభాకర్‌రావు డుమ్మా కొట్టడం చర్చనీయం కావండతో.. దీనిపై తాజాగా ప్రభాకర్ రావు స్పష్టతనిచ్చారు.

#cm-revanth #telugu-news #telangana-news #cmd-prabhakar-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe