Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం, మంత్రులు.. అధికారులకు కీలక ఆదేశాలు వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 15 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి సీఎం రేవంత్ మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు. వర్షకారం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డును యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. Also Read: మైనర్ బాలుడితో లేచిపోయిన వివాహిత.. చెన్నైకి తీసుకెళ్లి దారుణం! అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను సీఎం, మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్‌ను హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోం గార్డుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. Also Read: రూ.2 కోట్ల విలువైన మద్యం.. ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారంటే..? #cm-revanth #telugu-news #telangana-news #heavy-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి