Siddipet: మైనర్ బాలుడితో లేచిపోయిన వివాహిత.. చెన్నైకి తీసుకెళ్లి దారుణం!

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 27ఏళ్ల వివాహిత మైనర్ బాలుడితో లేచిపోయిన ఘనట సిద్ధిపేటలో చోటుచేసుకుంది. అద్దె ఉంటున్న యజమాని కొడుకు(16)ను లొంగదీసుకున్న కిలాడి బాలుడితోపాటు బంగారం, నగదుతో చెన్నై చెక్కేసింది. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Siddipet: మైనర్ బాలుడితో లేచిపోయిన వివాహిత.. చెన్నైకి తీసుకెళ్లి దారుణం!

Crime: సిద్ధిపేట జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ 27 ఏళ్ల వివాహిత మైనర్ బాలుడితో లేచిపోయింది. హనుమాన్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న కిలాడీ యజమాని  కొడుకు (16)ను మాయమాటలతో లొంగదీసుకుంది. ఆ తర్వాత తన ఇంట్లోని డబ్బులు, నగదు తీసుకురమ్మని చెప్పి బాలుడిని చెన్నైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత అతన్ని రూమ్ లో వదిలేసి వెంట తీసుకెళ్లిన నగదు, బంగారం అమ్మేసి జల్సా చేసింది. ఈ క్రమంలోనే బాలుడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. వివాహితపై పొక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు