Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు

సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు.

Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు
New Update

Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి(Nymisha Reddy) తన గొప్ప మనసును చాటుకుంది. హైదరాబాద్‌(Hyderabad) ఎల్బీనగర్‌లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి(Orphanage) చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ 30 మంది పిల్లలకు టికెట్లు కొని వాళ్లని స్వయంగా నైమిషా రెడ్డి స్టేడియంకి తీసుకెళ్లారు. ఆ పిల్లలతో పాటు ఆమె మ్యాచ్‌ను వీక్షించారు. అయితే మొదటిసారిగా స్టేడియంలో మ్యాచ్‌ను నేరుగా చూడటం, ఆటగాళ్లను దగ్గరి నుంచి చూడటంతో ఆ అనాథ పిల్లలు ఆనందంలో మునిగిపోయారు. ఆ చిన్నారుల్లో సంతోషం నింపేందుకే నైమిషా ఈ పని చేశారని ఆమె సన్నిహితులు చెప్పారు.

publive-image

Also Read: తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు..ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

ఓవైపు తండ్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తుండగా.. నైమిషా రెడ్డి ఇలాంటి సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇక నిన్న ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో 165 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు 9.4 ఓవర్లలోనే 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు.

Also Read: అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..

#cm-revanth #telugu-news #hyderabad #uppal-stadium #nymisha-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe