CM Revanth Reddy : హైదరాబాద్(Hyderabad) లోని పాతబస్తీ మెట్రో రైలు(Metro Train) నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 7వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అయితే 2012లోనే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నూమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసారు. కానీ పలు కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే ఆపేశారు.
Also Read: డీఎస్సీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
బడ్జెట్‌లో మెట్రో కోసం నిధులు
పాతబస్తీలో రోడ్డు విస్తరణ చేపట్టడం, నిర్మాణాల కూల్చివేతల వంటి కారణాల వల్ల నిర్మాణ పనుల్లో చాలా ఆలస్యం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం హయాంలోనే ఇందుకు సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. అలాగే డీపీఆర్‌తో పాటు మరికొన్ని పనులు కూడా పూర్తయ్యాయి. కానీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో(L&T Metro) నిర్మాణంపై నిర్లక్ష్యం వహించింది. ఇక చివరకి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar).. పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించింది. అంతేకాదు ఈ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.
5 స్టేషన్లు రానున్నాయి
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రాబోతున్నాయి. ఎంజీబీఎస్ దాటిన తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి.
Also Read : భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు