Revanth Reddy : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.

New Update
BIG BREAKING: వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Revanth Reddy Visit Delhi Today : తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ (Congress) ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్‌ సమావేశానికి ముందు రేవంత్‌ కొందరు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. రేవంత్ తన పర్యటనలో ఆయన ఏఐసీసీ (AICC) నేతలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, అలాగే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం అంశాల గురించి రేవంత్‌ ఇతర అధికారులతో చర్చించనున్నారు.

రేవంత్ ఇప్పటిఏ కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరగా, వారి ఆమోదం మేరకు సమావేశాలు ఖరారు కానున్నాయి. పెండింగ్‌ బకాయిలు, వివిధ ప్రాజెక్టులకు నిధులు మంజూరు వంటి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి లేవనెత్తే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలిపారు.

Also read: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త…మూడురోజులు వానలే..వానలు!

Advertisment
తాజా కథనాలు