Telangana : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త... మూడురోజులు వానలే.. వానలు! తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ వివరించింది. By Bhavana 24 Jun 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Rain Alert : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ (IMD) వివరించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, , నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడ ఓ మోస్తరు వర్షాపాతం (Heavy Rain) నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, సంగారెడ్డి, మంచిర్యాల, తో పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాజీపేటలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. Also read: నాడు దిష్ఠిబొమ్మల దగ్ధం.. నేడు కాళ్ల బేరం: బోరున విలపిస్తున్న వాలంటీర్లు! #hyderabad #telangana #imd #rain-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి