CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్

TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు.

New Update
CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy Slams KCR & Harish Rao: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేటలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును (Neelam Madhu) గెలిపించాలని సిద్ధిపేట ప్రజలను కోరారు. సిద్ధిపేటలో (Siddipet) ఏర్పాటు చేసిన రోడ్ షో లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు లపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో పదవులు అనుభవించి మామ అల్లుడు రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ALSO READ: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్‌ జెండా ఎగరకుంటే శాశ్వతంగా బానిసత్వం వస్తుందని అన్నారు. ఇక్కడ పోటీ చేయాలంటే పోలీసుల చేత కేసులు పెట్టిస్తారని వ్యాఖ్యానించారు. ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి పాపాల భైరవుల్లా మామ, అల్లుడు పట్టి పీడిస్తున్నారని విమర్శించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్న డబ్బులు ఆస్తులు చూసి కేసీఆర్ టికెట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. కలెక్టర్‌గా ఉండి వెంకట్రామి రెడ్డి వందల ఎకరాలు కొల్ల గొట్టారని ధ్వజమెత్తారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో.. కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగని అని అన్నారు. సిద్దిపేటలో మూడు రంగుల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు