BIG BREAKING: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. By V.J Reddy 16 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందనే అంశంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపడుతామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరిని మేడిగడ్డ ప్రాజెక్ట్, అన్నారం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళతామని తెలిపారు. అన్ని విషయాలు తొందర్లోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. ALSO READ: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్ తెలంగాణ ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం, అన్నారం ప్రాజెక్ట్ కు గండి పాడడం వంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గత కొంత కాలంగా ఆరోపిస్తునే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ల వల్ల తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతోందని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖండించాయి. కాళేశ్వరం నీళ్లు ఏ పొలానికి రాలేదని ఆరోపించాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు ఎటిఎంలా మారిందని ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అదే సమయంలో మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోవడంతో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల గలిగింది కాంగ్రెస్ పార్టీ. ALSO READ: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కర్ శుభవార్త.. రూ.12 వేలు.. ఎప్పటినుంచంటే? ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు తలనొప్పిగా మారాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మసాగారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిజంగానే అవినీతి జరిగిందనే భావనకు వచ్చారు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోడానికి ప్రధాన కారణంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపడుతామని చెప్పింది. అయితే, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని వెల్లడించారు. సీఎం రేవంత్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. #kcr #telugu-news #cm-revanth-reddy #kaleshwaram-poject #medigadda-lakshmi-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి