CM Revanth: కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్‌ రెడ్డి

కేసీఆర్‌ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనన్నారు.

CM Revanth: కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్‌ రెడ్డి
New Update

CM Revanth Reddy Comments On KCR: కేసీఆర్‌ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. 'రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. కేవలం కరెంటు బిల్లుల కోసమే ప్రతీ ఏడాది రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.

Also Read: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

నీళ్లు లేవు

ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు. 2020లోనే ఈ బ్యారేజీకి (Medigadda Barrage) ముప్పు ఉందని అధికారులు ఎల్&టీకి లేఖ రాశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా కూడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని' రేవంత్ ( అన్నారు.

అడ్డగోలుగా స్కామ్ చేశారు

భారతదేశంలో ఇంతపెద్ద స్కామ్ ఏదీ లేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును (Kaleshwaram Project) 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభించిందని అన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేలక కోట్లకు పైగా పెంచేశారని ధ్వజమెత్తారు. వీళ్లు చేసిన పనిని చూస్తే.. తుగ్లక్‌ కూడా సిగ్గుపడతారని అన్నారు. నీటి నిర్వహణలో బేసిక్‌ రూల్స్‌ కూడా పాటించలేదని విమర్శించారు. ఏ వర్క్‌ చూసినా కూడా అందులో అడ్డగోలుగా స్కామ్‌లు చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు అవకతవకలపై కేసీఆర్‌ ఇంతవరకు నోరు మెదపలేదని ఆరోపించారు. ఈ స్కామ్‌పై క్రిమినల్‌ ప్రాసెక్యూషన్ చేస్తామని స్పష్టం చేశారు.

Also Read: బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!

#kcr #telugu-news #revanth-reddy #kaleshwaram-project #telagana-news #medigadda-barrage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe