CM Revanth Reddy : కరెంటు కోతలు, నీటి సమస్య లేకుండా చూడాలి : సీఎం రేవంత్ రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి సరఫరా సమస్యలు లేకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలవారీగా కార్యచరణ రూపొందించాలని.. జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచనలు చేశారు. By B Aravind 30 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Electricity & Water : వేసవి(Summer) లో విద్యుత్, తాగునీటి సరఫరా(Electricity & Water Problem) కు సంబంధించి సీఎం రేవంత్(CM Revanth) అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా ఉండాలని ఆదేశించారు. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందుచుకోవాలన్నారు. అలాగే పంటలు కూడా ఎండిపోకుండా చూడాలని తెలిపారు. Also Read : టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. లిస్ట్ ఇదే! ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్ వరకు ప్రజలు బోర్లు, బావులు ఇతర స్థానిక నీటి వనరులను వాడుకోవాలి. తాగునీటికి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యచరణ రూపొందించాలి. జిల్లాస్థాయి(District Level) లో ప్రత్యేక అధికారిని నియమించాలి. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలి. ఎవరైనా ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపే చేరుకునేలా చూడాలని' సీఎం రేవంత్ ఆదేశించారు. Also read: ‘వాళ్లని తీసుకురా ప్రమాణం చెద్దాం’: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి #telugu-news #telangana-news #cm-revanth-reddy #electricity #water-problem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి