CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చురకలు

కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు.

CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చురకలు
New Update

CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కేసీఆరే టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి (Telangana Assembly Sessions) ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఆయన స్థానాల్లో ఎవరినైనా పంపిస్తారా? అంటూ చురకలు అంటించారు.

ALSO READ: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్

ఛాంబర్ ఇవ్వాలి ఇచ్చాం..

లిడార్ ఆఫ్ అపోజిషన్ (LOP) కేసీఆర్ కు అసెంబ్లీలో గది మారుస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పై బీఆర్ఎస్ (BRS) నేతలు చేస్తున్న ఆరోపణలపై సి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఛాంబర్ ఇవ్వాలి ఇచ్చామని.. కానీ ఇక్కడే ఇవ్వాలి... ఇది ఇవ్వద్దు అని లేదని అన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మేము బాద్యులం అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ గది మార్చాలి అనేది స్పీకర్ నిర్ణయం అని అన్నారు. కేసీఆర్ సభకు రావాలని.. ప్రతిపక్ష నేతగా సభలోకి రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

అందుకే KRMB ఇష్యూ..

మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి KRMB ఇష్యూను కేసీఆర్ తీసుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ అధీనంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకు సీఎం జగన్ తుపాకులు పంపి గుంజుకునే పని చేశారూ.. మూడు రోజులు పోలీసులు అక్కడే ఉన్నారు.. అప్పుడు నువ్వు ఎక్కడా పడుకున్నావు అని కేసీఆర్ ను నిలదీశారు.

రోజా పెట్టిన చేపల పులుసు..

ప్రతీ రోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది.. కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కి ఉన్న కమిట్ మెంట్.. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అని అన్నారు. రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమకు రత్నాలు చేస్తా అన్నారని చురకలు అంటించారు. కేసీఆర్ కమిట్ మెంట్ మీద ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. కేసీఆర్ కమిట్ మెంట్ మీద ఎవడికైనా డౌట్ ఉందంటే.. హరీష్ రావుకే ఉందని సెటైర్లు వేశారు.

కేసీఆర్ వచ్చినా కలుస్తా...

తన వద్దకు కేసీఆర్ వచ్చినా కలుస్తానని అన్నారు సీఎం రేవంత్. అసలు కేసీఆర్ సభకు వస్తారా..?.. ఇవాళైతే రాలేదని అన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన అసహనం తో మట్లాడుతున్నారని అన్నారు. మనుగడ కోసం మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. BACకి కూడా కేసీఆర్ రాలేదని.. రాష్ట్ర ప్రజల సమస్యలు చర్చించేందుకు అయినా కేసీఆర్ సభలోకి రావాలని కదా.. దీని బట్టే కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు అంటే ఎంత కమిట్ మెంట్ ఉందొ అర్ధం చేసుకోవచ్చని రేవంత్ అన్నారు.

కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ..

కాళేశ్వరం మీద న్యాయ విచారణ కి జడ్జి ని ఇవ్వండి అని హైకోర్టును కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు. సిట్టింగ్ ని ఇవ్వలేమని.. రిటైర్డ్ జడ్జిని ఇస్తామని హైకోర్టు తెలిపినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ జడ్జి తో విచారణపై సభలో, కేబినెట్ లో చర్చిస్తామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయమని కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు.

DO WATCH:

#kcr #cm-revanth-reddy #brs-party #krmb #judicial-enquiry-on-medigadda-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe