/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/31-1-1-jpg.webp)
CM Revanth Reddy on Sheep Distribution Scheme: పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశం ఇచ్చారు. స్కీంలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావేదేవీలపై (Transactions) పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అన్నారు. విచారణ తర్వాత ప్రాథమిక నివేదికను ఏసీబీ (ACB) ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు. ఈ పథకాల్లో దళారులతో పాటు ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం.
Also Read: ‘బడే భాయ్’ అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!
మాజీ మంత్రే టార్గెట్?..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల పంపిణి స్కాం కేసులో (Sheep Distribution Scam) ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ల మాయంపై ఓ మాజీ మంత్రి ఓఎస్డీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2018 నుంచి ఈ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశంపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందులో ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరి పాత్ర ఉంది అనే దానిపై ఎంక్వైరీ చేయాలని అన్నారు.
నలుగురి పై కొనసాగుతున్న ఏసీబీ విచారణ..
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యాదవ సోదరుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల కాగ్ (CAG Report) ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ ఏసీబీ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కాంలో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల పశుసంవర్ధక శాఖ (Department of Animal Husbandry) లోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ఆ దిత్య కేశవ సాయి లను అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిని అదులోపు తీసుకొని మిగితా సమాచారాన్ని లాగుతున్నారు.
గొర్రెల పంపిణీ స్కాంలో నలుగురు అరెస్ట్
పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల స్కాం
పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ… pic.twitter.com/NwV35eqKR4
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2024