CM Revanth : మూతబడ్డ నిజాం చక్కెర కర్మాగారాలు తెరిచే దిశగా కాంగ్రెస్ నిర్ణయం తెలంగాణలో మూతబడ్డ నిజాం చక్కెర కార్మాగాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్ కేబినేట్ సబ్‌కమిటీకి సూచించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. By B Aravind 04 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nizam Sugar Factory : రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల(Nizam Sugar Factory) పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేబినేట్ సబ్ కమిటీకి సూచనలు చేశారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. Also Read : ఇకపై వాహనాలకు TS కాదు TGనే.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు. Also Read : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు #telangana #telugu-news #nizam-sugar-factory #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి