Telangana : ఇకపై వాహనాలకు TS కాదు TGనే.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయలు తీసుకుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వాహనాలకు TS బదులుగా TG గా నిర్ణయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

New Update
Telangana : ఇకపై వాహనాలకు TS కాదు TGనే.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ(Telangana) కేబినెట్ ఈరోజు భేటీ అయింది. మొత్తం 25 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్(Revanth Sarkar) అడుగులు వేసింద. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వాహనాల నెంబర్ ప్లేట్ లను TS నుంచి TG గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణకు ఆమోదం తెలిపింది. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Also Read : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

TS పోయి TG వచ్చే..

తెలంగాణ ప్రజలకు మరోసారి ఉద్యమ స్ఫూర్తి నింపేలా రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత వాహనాల నెంబర్ ప్లేట్లకు కేంద్ర ప్రభుత్వం టీజీని (TG) ఆమోదించింది.. కానీ ఆనాటి సీఎం కేసీఆర్(Ex. CM KCR) వాస్తు కోసమని టీజీని టీఎస్ (TS) గా మార్చాలని కేంద్రానికి లేఖ పంపినట్లు గతంలో కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అయితే.. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే TS ను TGగా మారుస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొలువుదీరిన తరువాత ప్రజలు కోరుకున్న టీజీనే వాహనాల నెంబర్ ప్లేట్లకు పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కపై వాహనాలకు TS బదులు TG నెంబర్ ప్లేట్లు రానున్నాయి.

ఇకపై కరెంట్ ఫ్రీ...

ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది రేవంత్ సర్కార్. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ పథకం అమల్లోకి రానుంది.

రూ.500లకు గ్యాస్ వచ్చేస్తుంది...

గ్యాస్ సిలిండర్ ధరలు(Gas Cylinder Rates) పెరిగాయి బాబోయ్ అని ఆందోళన చెందుతున్న సామాన్య కుటుంబాలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం త్వరలో అమల్లోకి రానుంది.

Also Read : Andhra Pradesh : మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

DO WATCH: 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు