Telangana: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. By B Aravind 28 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని తెలిపారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని పేర్కొన్నారు. రుణమాఫీ తర్వాత రైతుబంధు, ఇతర పథకాలపై దృష్టి పెడతామని తెలిపారు. Also Read: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు ' కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక రెండురోజులకి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలుంటాయి. బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు తెలియజేశాం. అంచనాలకు మించి ఊహజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేశాం. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చలు జరిపి ఆ తర్వాత కమిషన్ ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరంకు సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీలో చర్చిస్తాం. చర్చల అనంతరం డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామని' రేవంత్ అన్నారు. Also Read: సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ముక్కలు ముక్కలైన కార్మికులు #cm-revanth #telugu-news #telangana-news #crop-loan-waiver #farmer-loan-waiver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి