రైతు భరోసా వారికే.. || CM Revanth Shocking decision On Rythu Barosa ||Telangana || RTV
కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వారి విన్యాసాలు, అసత్య ప్రచారాలు చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. ఎటూ పాలుపోక కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ కానివారి కోసం వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కానివారు మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొంది.
సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు.
రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా.
రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో హామీలపై కేబినెట్ లో చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ పంట రుణాల మాపీపై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని అమలు చేస్తూ తెలంగాణలోని రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఆగస్టు 15లోగా కాంగ్రెస్.. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.