CM Revanth: త్వరలో 15వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం అని అన్నారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

New Update
Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగల భర్తీపై కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను గుర్తించి భర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని అన్నారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిపై సమీక్షించి.. నియామకాలు త్వరగా జరిగేలా చూశారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం కావాలని చూశాం అని వ్యాఖ్యానించారు.

ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ మరోసారి పొడిగింపు

విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం అని హామీ ఇచ్చారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్. తెలంగాణ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వైద్య ఆరోగ్య శాఖలో మరో 5 వేల ఉద్యోగాలు ..

వైద్య ఆరోగ్య శాఖలో మరో 5 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని అన్నారు. ఒకేసారి 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారని అన్నారు. గొప్ప ఆశయంతో తెలంగాణ కోసం యువత పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే నేడు ఉద్యోగాలు వస్తున్నాయి అని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మరో 5 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ALSO READ: ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ వార్నింగ్

 

Advertisment
తాజా కథనాలు