Sajjanar: ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ వార్నింగ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిని హెచ్చరించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హయత్ నగర్ డిపో కండక్టర్పై ఓ మహిళా దాడి చేయడంపై ఆయన ఇలా స్పందించారు. By V.J Reddy 31 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSRTC MD Sajjanar: హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) సీరియస్ అయ్యారు. ALSO READ: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY — Telugu Scribe (@TeluguScribe) January 31, 2024 సజ్జనార్ ట్విట్టర్ (X)లో .. "హయత్నగర్ డిపో-1కు (Hayathnagar Bus Depo) చెందిన ఇద్దరు కండక్టర్లపై (Bus Conductors) ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది." అంటూ రాసుకొచ్చారు. హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024 DO WATCH: #congress-party #sajjanar #tsrtc-md-sajjanar #telangana-latest-news #free-bus-scheme #tsrtc-free-bus-scheme సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి