Amit Shah Fake Video : ఇటీవల అమిత్ షా(Amit Shah) తెలంగాణ(Telangana) కు వచ్చినప్పడు రిజర్వేన్లకు సంబంధించి మాట్లాడిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు(Delhi Police Case) కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలకు బుధవారం విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్ మాత్రం ఈరోజు విచారణ హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా ఈ విషయాన్ని తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also read: నాలుగు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు
రేవంత్‌తో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తమకు ఇందుకోసం 15 రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఇదిలాఉండగా.. కేంద్రమంత్రి అమిత్ షాకి సంబంధించిన ఆ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటి హక్కులు ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని అన్నారు. కానీ ఆ ఫేక్ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని మాట్లాడినట్లు ఉంది. అయితే ఈ వీడియోపై అమిత్ షా కూడా స్పందించారు. తాము రిజర్వేషన్లను ఎప్పటికీ తొలగించమని స్పష్టం చేశారు.
Also Read: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!